Hyderabad, జూలై 25 -- కరోనా తర్వాత ఆడియెన్స్‌కు యమ ఎంటర్ట్‌టైన్‌మెంట్‌ను అందించిన ఏకైక ప్లాట్‌ఫామ్ ఓటీటీ. ఈ ఓటీటీలో విభిన్న జోనర్లలో, హద్దులు దాటిన భాషలతో ఎన్నో రకాల కంటెంట్ ప్రేక్షకులు ఇంట్లోకి వచ్చి చేరింది. ఓటీటీలకు అలవాటు పడిన భాషా బేధం లేకుండా కంటెంట్‌ను ఆదరించారు.

అయితే, కొన్ని ఓటీటీలు మాత్రం విచ్చలవిడిగా శృంగార కంటెంట్‌ను ప్రసారం చేయడం సాగాయి. అలా కుప్పలుతెప్పలుగా బోల్డ్ కంటెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువయ్యాయి. అలాగే, ఓటీటీల్లో కూడా శృంగార సీన్లు ఎక్కువగా ఉండే కంటెంట్ ఇటీవల కాలంలో అధికంగా స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి.

ఇలా సాఫ్ట్ పోర్న్, అశ్లీల, బోల్డ్ కంటెంట్‌ను ప్రసారం చేసే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఏకంగా 24 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓటీటీల్లో సాఫ్ట్ పోర్న్, అశీల, అ...