భారతదేశం, ఏప్రిల్ 29 -- నేచురల్ స్టార్ నాని, సమంత హీరోహీరోయిన్లుగా 'ఏటో వెళ్లి పోయింది మనసు' సినిమా 2012 డిసెంబర్‌లో వచ్చింది. ఈ లవ్ రొమాంటిక్ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ చాలా మంది హృదయాల్లో నిలిచిపోయింది. ఈ సినిమాకు ఇసైజ్ఞాని ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని కొన్ని పాటలు క్లాసిక్‍గా నిలిచిపోయాయి.

ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంలోని 'కోటి కోటి తారల్లోన' సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ పాటకు మంచి మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు ఇళయరాజ. ఈ సాంగ్‍ను కార్తీక్ పాడారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటలో సాహిత్యం ఆకట్టుకుంటుంది. చాలా రోజుల ఎడబాటు తర్వాత ప్రేయసి నిత్య (సమంత)ను కలిసేందుకు వరుణ్ కృష్ణ (నాని) ప్రయాణిస్తున్న సందర్భంలో సినిమాలో ఈ పాట వస్తుంది. ఏమైనా జీవితాంతం తోడు ఉంటానని ప్రేయసికి చెప్పేందుకు సూటయ్యే మ...