Hyderabad, ఏప్రిల్ 26 -- "ఒరేయ్ బాబూ.. ఒకరికొకరు ప్రేమించుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? జీవితం ఎలా గడిచేది" అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఒకరిపై ఒకరు స్వచ్ఛమైన ప్రేమ చూపించుకుంటేనే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటామట. మరి ఆరోగ్యంగా ఉంటేనే కదా, సంపాదించేది, జీవితాన్ని నడిపించుకోగలిగేది. మీ ప్రేమ నిజమై, మీ భాగస్వామితో రొమాన్స్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంటే, మీరు ఇతరులకన్నా ఆరోగ్యంగా, మెరుగైన జీవితం గడుపుతారని నిపుణులు చెబుతున్నారు. ఇది సైంటిఫికల్ ప్రూవ్ అయింది కూడా. మంచి అనుబంధంతో రొమాంటిక్ లైఫ్ గడుపుతున్న దంపతులు ఆరోగ్యంగా ఉండి, నాణ్యమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తేలింది.

దాదాపు మూడు దశాబ్దాల పాటు వివిధ పరిశోధనలను కలిపి చేసిన నివేదిక ఆధారంగా ప్రేమ, సంబంధాలు, యువత, మధ్య వయస్సు వారి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో, వారికి ఆరోగ్యకరమైన, దీర్ఘాయువును ఎలా ...