భారతదేశం, అక్టోబర్ 31 -- బెంగుళూరు దక్షిణ ప్రాంతంలో దిగ్భ్రాంతికరమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలిక, ఆమె స్నేహితులు కలిసి 34 ఏళ్ల తన తల్లిని దారుణంగా చంపి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఉత్తరహళ్లిలోని వారి ఇంట్లోనే జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆ టీనేజ్ బాలిక, ఆమె నలుగురు మిత్రులు కలిసి తల్లిని టవల్‌తో గొంతు నులిమి చంపేశారు. అనంతరం, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, చీర సాయంతో మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత, బాలిక ఇంటికి తాళం వేసి కొన్ని రోజులు కనిపించకుండా పోయింది. చివరకు ఆమె తన నాయనమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. అక్కడ ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో, చివరికి నిజం ఒప్పుకున్నట్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక కథనం వెల్లడించింది. ...