భారతదేశం, నవంబర్ 7 -- ఇవాళ (నవంబర్ 7) థియేటర్లలో ఎన్నో తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో బోల్డ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రంగా వచ్చిందే ప్రేమిస్తున్నా. ఈ సినిమాలో సాత్విక్, ప్రీతీ నేహా హీరో హీరోయిన్లుగా నటించారు. భాను దర్శకత్వం వహించిన ఈ సినిమాను వరలక్ష్మీ పుప్పుల సమర్పణలో కనకదుర్గరావు నిర్మించారు.

ప్రేమిస్తున్న పాటలకు యూట్యూబ్‌లో మంచిరెస్పాన్స్ వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ ఒకింత బజ్ క్రియేట్ చేసింది ప్రేమిస్తున్నా. మరి డిఫరెంట్ ప్రపోజల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ప్రేమిస్తున్నా రివ్యూలో తెలుసుకుందాం.

హీరో (సాత్విక్ వర్మ)కు తండ్రి లేకపోవడంతో అన్ని తానై పెంచుతుంది తల్లి శారద. రైల్వేలో చిన్న ఉద్యోగం చేసే శారదకు సొంతూరు నుంచి ఘట్కేసర్‌లో రైల్వే కాలనీకి బదిలీ అవుతుంది. వస్తువులు ఇంట్లోకి షిప్ట్ చేస్...