భారతదేశం, జూలై 26 -- అత్యంత తెలివిగా ప్లాన్ చేసిన హత్యను పోలీసులు చేధించారు. బెంగళూరులోని కన్వా డ్యామ్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ మహిళ తన భర్త మృతదేహంపై పడి ఏడుస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతా అది హత్య కేసుగానే భావించారు. కానీ ఒక బాటిల్ క్యాప్, ఒక చెప్పు ఒక భార్య తన ప్రేమికుడి కోసం భర్త ను హత్య చేసిన నేరాన్ని వెలుగులోకి తెచ్చాయి.

ఘటనా స్థలంలో పోలీసులు ఒక వ్యక్తి మృతదేహం, ఆ పక్కనే ఏడుస్తున్న అతని భార్య, కొన్ని అడుగుల దూరంలో పార్క్ చేసిన అతని కారును, అక్కడే పడి ఉన్న ఖాళీ విషం బాటిల్ ను గుర్తించారు. ఇన్స్పెక్టర్ బీకే ప్రకాశ్, ఎస్ఐ సహనా పాటిల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించగా 'విషం బాటిల్ క్యాప్ కనిపించలేదు. అలాగే, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (చన్నపట్న) కెసి గిరికి అక్కడే బాధితుడికి చెందిన ఒకే చెప్...