భారతదేశం, డిసెంబర్ 1 -- మహారాష్ట్రలోని నాందేడ్​లో ఒక ప్రేమ కథకు అత్యంత విషాదకరమైన ముగింపు పడింది! కుల విభేదాల కారణంగా మహిళ కుటుంబసభ్యులు, ఆమె ప్రేమించిన వ్యక్తిని చంపేసినట్టు తెలుస్తోంది. అతని అంతి సంస్కారాలు జరగడానికి ముందు, ఆ మహిళ, అతని మృతదేహాన్ని వివాహం చేసుకుంది!

"సాక్షిం టేట్​ మరణంలో కూడా మా ప్రేమ గెలిచింది. నా తండ్రి, అన్నలు ఓడిపోయారుస" అని 21ఏళ్ల అంచల్ మామిద్వార్​ కన్నీళ్లతో చెప్పింది. సాక్షిం ఇంటి కోడలిగా జీవితాంతం అక్కడే ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ ఆత్మార్పణ వేడుకతో తమ ప్రేమ "అమరం" అవుతుందని ఆమె​ ప్రకటించింది.

ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

అంచల్‌కు సాక్షిం టేట్‌తో పరిచయం ఆమె అన్నల ద్వారానే జరిగింది! అయితే, సాక్షిం వేరే కులానికి చెందినవాడు కావడంతో, వారి ప్రేమ వ్యవహారాన్ని ...