Hyderabad, ఆగస్టు 16 -- భారతదేశమంతా శ్రీకృష్ణ జన్మాష్టమిని అంగారంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 16 అంటే ఈరోజు వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. కృష్ణుని అనుగ్రహం కలగాలని ఉపవాసం కూడా ఉంటారు. కృష్ణాష్టమి నాడు కొంతమంది కృష్ణుడి విగ్రహాన్ని కొనుగోలు చేస్తారు. ఆవు దూడతో కలిసి ఉన్న కృష్ణుని విగ్రహాన్ని కృష్ణాష్టమి నాడు ఇంటికి తీసుకురావడం వలన మంచి జరుగుతుంది. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

అష్టధాతువులతో చేసిన కృష్ణుడి విగ్రహాన్ని కృష్ణాష్టమి నాడు ఇంట్లో పెట్టడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. అదే విధంగా, కృష్ణాష్టమి నాడు వైజయంతి మాలను కూడా ఇంటికి తీసుకురావడం శుభప్రదం. దీనిని తీసుకురావడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

దక్షిణావర్తి శంఖం కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కృష్ణా...