Hyderabad, జూన్ 9 -- తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. ఈ ఛానెల్ తాజాగా తన బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ సరికొత్త వీడియోను రూపొందించింది. తెలుగు సాంప్రదాయంలో జరిగే ఓ అమ్మాయి పెళ్లిని ఇందులో చూపిస్తూ.. ప్రేమతో జీ తెలుగు అనే సరికొత్త నినాదాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇప్పుడీ వీడియో బాగా వైరల్ అవుతోంది. తన లోగోని కూడా మార్చేసిన ఆ ఛానెల్.. సరికొత్తగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ జీ తెలుగు బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి సంప్రదాయాలను చక్కగా ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్‌ ఫిల్మ్‌లో సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచే తెలుగువారి లోగిలిలో జరిగే పెళ్లి వేడుకను కళ్ళకు కట్టినట్లు చూపించారు.

మొత్తం జీ తెలుగు ఛానెల్లో వచ్చే సీరియల్స్, షోలలోని నటీనటులందరినీ ...