Hyderabad, ఫిబ్రవరి 17 -- తల్లిదండ్రులు కాబోతున్నాం అని తెలియగానే కలిగే ఆ ఫీలింగే వేరు. ఈ సమయంలో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ బిడ్డ రాక కోసం ఎదురుచూస్తారు. తల్లీ బిడ్డ క్షేమం కోసం తహతహలాడతారు. ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీ స్త్రీ తినే ఆహారం, తాగే పానీయాలు నుంచి ఆమె ఇష్టాలు, అభిరుచులు అన్నింటిపై పూర్తిగా శ్రద్ధ వహిస్తారు. అంతేకాదు.. చాలా మంది గర్భిణి ఉండే గది మొత్తాన్ని అందమైన చిన్న పిల్లల ఫొటోలు, పోస్టర్లతో నింపేస్తారు. కడుపుతో ఉన్నప్పుడు ఇలా క్యూట్ బేబీల ఫొటొలను చూడటం వల్ల కడుపు పెరుగుతున్న బిడ్డ కూడా అందంగా తయారవుతుంది, క్యూట్‌గా పుడుతుందని నమ్ముతారు. నిజంగానే ఇలా జరుగుతుందా? ఈ విషయంలో వాస్తవం ఏంటి అపోహలేంటి అనే విషయాలను తెలుసుకుందాం రండి.

వినడానికి చాలా బాగా అనిపించినప్పటికీ గర్భధారణ సమయంలో అందమైన ...