Hyderabad, ఆగస్టు 28 -- ముగ్గురు పిల్లల తల్లి అయిన బాలీవుడ్ నటి సన్నీ లియోనీ.. వీళ్లలో ఒక్కరిని కూడా కనలేదు. ఒకరిని దత్తత తీసుకోగా, మరో ఇద్దరిని సరోగసీ ద్వారా పొందింది. దత్తత తీసుకున్న కూతురు నిషా, సరోగసీ ద్వారా పుట్టిన కవలలు నోహ్, అషర్.. తన సరోగసీ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆమె తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఆ సరోగసీ మదర్ కు భారీగా డబ్బు ఇచ్చామని, దాంతో ఆమె ఇల్లు కట్టుకుందని, భారీగా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుందని చెప్పడం విశేషం.

సన్నీ లియోనీ తాజాగా సోహా అలీ ఖాన్ హోస్ట్ చేసే 'ఆల్ అబౌట్ హర్' అనే పాడ్‌కాస్ట్‌లో సరోగసీ జర్నీ గురించి మాట్లాడింది. ఈ ఎపిసోడ్ ట్రైలర్‌ను సోహా గురువారం (ఆగస్టు 28) పోస్ట్ చేసింది. ఇందులో సన్నీ తన లైఫ్ గురించి నిజాయితీగా మాట్లాడింది.

వీడియో మొదట్లో సోహా మాట్లాడుతూ.. "ఈరోజు ఎపిసోడ్ పేరెంట్స్ అవ్వడానికి ఉన్న ...