భారతదేశం, జూన్ 15 -- రెబల్ వైబ్ స్టార్ట్ కాబోతోంది. ఫ్యాన్స్ ను అలరించేందుకు గ్యాప్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ వచ్చేస్తున్నారు. రాజాసాబ్ మేనియాతో దుమ్ము లేపబోతున్నారు. చాలా కాలం వెయిటింగ్ తర్వాత రాజాసాబ్ నుంచి టీజర్ రాబోతోంది. రేపు (జూన్ 16) రాజాసాబ్ టీజర్ రిలీజ్ కాబోతోంది. అంతకంటే ముందు ఈ రోజు (జూన్ 15) ప్రీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రీ టీజర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక టీజర్ ఎలా ఉంటుందో అనే అంచనాలు తారస్థాయికి చేరాయి.

రెబల్ వైబ్ స్టార్ట్ అవుతుందంటూ రాజాసాబ్ ప్రీ టీజర్ ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. ఈ 25 సెకన్ల వీడియోలోనే మూవీలోని హారర్ ను చూపించే ప్రయత్నం చేశారు. ఇందులోనే టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు. జూన్ 16న ఉదయం 10.52 గంటలకు ది రెబల్ వైబ్ స్టార్ట్ కాబోతుందని ఆ వీడియోలో పేర్కొన్నారు. టీజర్ మరో రోజు మాత్రమే ...