భారతదేశం, డిసెంబర్ 23 -- ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా జరిగిన ఒక హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య, ఆమె ప్రియుడు కలిసి అతి కిరాతకంగా అంతమొందించారు. సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. సంభాల్‌లోని చున్నీ మొహల్లాకు చెందిన రాహుల్, రూబీ దంపతులు. గత కొంతకాలంగా రూబీకి స్థానిక యువకుడు గౌరవ్‌తో వివాహేతర సంబంధం ఉంది. నవంబర్ 18న వీరి వ్యవహారం రాహుల్‌కు తెలిసిపోయింది. దీంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. తన గుట్టు తెలిసిపోయిందన్న కోపంతో, అడ్డు తొలగించుకోవాలని రూబీ, గౌరవ్ కలిసి పథకం వేశారు.

నవంబర్ 18న గౌరవ్ ఇనుప రాడ్, చెప్పులు కుట్టే సుత్తితో రాహుల్ తలపై బలంగా కొట్టి అక్కడికక్కడే ప్రాణం తీశా...