భారతదేశం, జనవరి 11 -- రవితేజ సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'తో డెబ్యూ చేసిన హీరోయిన్ నుపుర్ సనన్ పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, సింగర్ స్టెబిన్ బెన్ ను గ్రాండ్ సెరెమనీలో మనువాడింది. ఈ జంట ఉదయపూర్ లో వివాహం చేసుకుంది. అద్భుతమైన క్రైస్తవ వేడుకలతో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. స్టార్ హీరోయిన్ కృతి స‌న‌న్‌ చెల్లెనే నుపుర్ సనన్.

నుపుర్, స్టెబిన్ పెళ్లి వీడియోలు వైరల్ గా మారాయి. వైట్ డ్రెస్ లో ఈ నవ దంపుతులు మెరిసిపోయారు. ఓ వీడియోలో స్టెబిన్ షాంపైన్ బాటిల్ ను ఓపెన్ చేస్తున్నట్లు కనిపించింది. నుపుర్ ఆఫ్ షోల్డర్ లేసీ గౌను లో అందంగా కనిపిస్తుంది. ఆమె మెహందీ కూడా చేతుల్లో కనిపిస్తుంది. ఆమె అక్క కృతి సనన్ తో సహా తోడి పెళ్లికూతుర్లందరూ సముద్రపు ఆకుపచ్చ దుస్తులు ధరించారు.

అంతకుముందు నుపుర్ సనన్, స్టెబిన్ సంగీత్ వేడుకల్లో కృత...