భారతదేశం, జనవరి 22 -- పరాయి వ్యక్తి మోజులో పడి.. కట్టుకున్నవారిని కనికరం లేకుండా చాలామంది చంపేస్తున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగింది. విచారణలో విస్తూపోయే విషయాలు బయటకు వచ్చాయి. ప్రియుడితో కలిసి భార్య ఈ దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసింది.

చిలువూరుకు చెందిన శివనాగరాజు(45), లక్ష్మీ మాధురికి 2007లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో మాధురి కొన్ని రోజులు పనిచేసింది. ఇదే సమయంలో ఆమెకు గోపీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

మాధురితో సంబంధం కొనసాగిస్తున్న గోపీ హైదరాబాద్‌లో కారు ట్రావెల్స్ నిర్వహించేవాడు. ప్రియుడితో ఎక్కువ కలిసేందుకు భర్తను అతడి వద్దకే ఉద్య...