భారతదేశం, డిసెంబర్ 30 -- కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా, తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇరు కుటుంబాల అంగీకారంతో తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నారు.

వీరిద్దరి నిశ్చితార్థం ఇప్పటికే నిరాడంబరంగా జరిగినట్లు తెలుస్తుండగా, డిసెంబర్ 31న బుధవారం నాడు రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో మరోసారి వైభవంగా వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. రాబోయే కొద్ది నెలల్లోనే వీరి వివాహం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల అవివా బేగ్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్, ప్రొడ్యూసర్. ఆమె తన కళ ద్వారా దైనందిన జీవితంలో...