Hyderabad, జూలై 16 -- ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ఇటీవల ప్రియాంక చోప్రా తన తాజా ఇంటర్నేషనల్ మూవీ 'హెడ్స్ ఆఫ్ స్టేట్'కుగాను ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె సాధించిన ఈ విజయం కేవలం ఆమెకు మాత్రమే కాదు, భారతదేశానికి కూడా గర్వకారణమని అన్నాడు. సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్.. ప్రియాంక అద్భుతమైన నటనను, అంతర్జాతీయ వేదికపై ఆమె భారతీయ ప్రతిభను ప్రదర్శించిన తీరును మెచ్చుకున్నాడు.

'హెడ్స్ ఆఫ్ స్టేట్' అనే హైఆక్టేన్ యాక్షన్-కామెడీ మూవీలో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఇందులో ప్రియాంక విజయం గురించి మాధవన్ మాట్లాడాడు. "ఆమె అక్కడకి వెళ్లి అంత పెద్ద హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రను సులువుగా పోషించింది. సినిమాలో ఆమె యాక్షన్...