భారతదేశం, డిసెంబర్ 28 -- సండే స్పెషల్ గా ఓ తెలుగు సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ మూవీ 'అస్మి'. ఇది ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇందులో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించాడు.

ప్రతి సండే ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈటీవీ విన్ కథాసుధలో భాగంగా ప్రతి ఆదివారం ఒక కొత్త సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇవాళ (డిసెంబర్ 28) అస్మి సినిమా ఈటీవీ విన్ లోకి వచ్చింది. ఇది సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కింది.

అస్మి సినిమాలో సీనియర్ నటుడు రాజీవ్ కనకాల లీడ్ రోల్ ప్లే చేశాడు. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ షార్ట్ ఫిల్మ్. జీవితమే ఓ నాటకం అని నమ్మే పెద్ద మనిషి ఒకవైపు.. ఉడికే రక్తంతో ఏదైన...