Andhrapradesh, సెప్టెంబర్ 3 -- కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. తుమ్మిడిహట్టి వద్దనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రాణహిత - చేవెళ్లతో పాటు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతామన్నారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గోదావరి, కృష్ణా నదులపై వైఎస్సార్ తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.

మంగళవారం హైదరాబాద్ లో జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ విప్లవ పితామహుడు, పద్మశ్రీ సుభాష్ పాలేకర్, శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్...