భారతదేశం, డిసెంబర్ 24 -- ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల యూకేజీ విద్యార్థి పెన్సిల్ గుచ్చుకుని మరణించాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. రోజూలాగే విహార్ అనే విద్యార్థి జేబులో పెన్సిల్ పెట్టుకున్నాడు. కానీ అదే అతడి ప్రాణాలు తీసింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విహార్ యూకేజీ చదువుతున్నాడు. రోజూలాగే పాఠశాలకు తాను రాసుకునే పెన్సిల్ తీసుకెళ్లాడు. చొక్కా జేబులో పెట్టుకున్నాడు. బాలుడు మధ్యాహ్నం విరామ సమయంలో టాయిలెట్ వెళ్లాడు. తర్వాత తన తరగతి గదికి తిరిగి పరిగెడుతుండగా.. జారి కిందపడిపోయాడు.

అదే సమయంలో జేబులో ఉన్న పెన్సిల్ ప్రమాదవశాత్తు విహార్ గొంతులో గుచ్చుకుంది. దీని వలన తీవ్ర రక్తస్రావం జరిగింది. పా...