భారతదేశం, జూలై 2 -- తల్లిగా మారిన తర్వాత, మహిళల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రసవం తర్వాత దేహంలో అనేక మార్పులు కనిపిస్తాయి. కొన్నిసార్లు ప్రసవానంతర డిప్రెషన్ వంటి భావోద్వేగ సమస్యల నుంచి, పీరియడ్స్ తిరిగి వచ్చినప్పుడు కలిగే తీవ్రమైన నొప్పి వంటి శారీరక మార్పుల వరకు అన్నీ కొత్తగానే ఉంటాయి. తొమ్మిది నెలల విరామం తర్వాత పీరియడ్స్ మళ్లీ వచ్చినా, వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉండి నొప్పి గతంలో కంటే ఎక్కువగా ఉండవచ్చు.

గురుగ్రామ్‌ మణిపాల్ ఆసుపత్రిలో ప్రసూతి, గైనకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ఇలా జలోటే HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రసవం తర్వాత పీరియడ్స్ ఎందుకు మరింత బాధాకరంగా మారతాయో వివరించారు.

"గర్భధారణ సమయంలో నెలల తరబడి పీరియడ్స్ లేకుండా ఉన్న తర్వాత, చాలా మంది కొత్త తల్లులు రుతుస్...