భారతదేశం, జూన్ 28 -- ప్రసవం తర్వాత కోలుకోవడానికి, మనసును కుదుటపరుచుకోవడానికి యోగా బాగా పనిచేస్తుంది. బిడ్డకు జన్మనివ్వడం అంటే మానసికంగా, శారీరకంగా పెద్ద మార్పు. తొమ్మిది నెలల గర్భం, ప్రసవ సమయంలో శరీరం చాలా ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. అప్పుడే అమ్మ అయిన తర్వాత వచ్చే మార్పులకు మనసు కూడా సిద్ధం కావాలి. ఇవన్నీ ఒక్కోసారి చాలా ఒత్తిడిని కలిగించవచ్చు. ఇలాంటి టైంలో ప్రసవానంతర యోగా (Postnatal Yoga) సాధన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, శరీరం శక్తివంతంగా మారుతుంది.

కేజే సోమయ్య మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని అబ్‌స్టెట్రిక్స్ గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అన్షిక కశ్యప్ తల్లులకు ప్రసవానంతర యోగా ఎలా సహాయపడుతుందో HT లైఫ్‌స్టైల్‌తో చెప్పారు.

"డెలివరీ తర్వాత తల్లులు తరచుగా అలసట, హార్మోన్ల మార్పులు వంటివి అనుభవిస్తారు. ఈ పరిస్థితుల మధ...