భారతదేశం, జనవరి 2 -- బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తన కెరీర్‌లో సూపర్ ఫేజ్ ఎంజాయ్ చేస్తున్నారు. హిందీలో 'ధురంధర్' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అతడు.. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న 'మహాకాళి' (Mahakali) సినిమాలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది.

'హనుమాన్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న తదుపరి మూవీ 'మహాకాళి'. ఈ సినిమాలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న పూజా కొల్లూరు.. అక్షయ్ ఖన్నాతో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

"కృతజ్ఞతలు 2025! నన్ను నా పరిమితులకు మించి కష్టపడేలా చేసి.. కొత్త నన్ను నాకు...