Hyderaba, జూలై 12 -- మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీ చిత్రంగా విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'గదాధారి హనుమాన్'. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రవి కిరణ్ హీరోగా నటించారు. ఈ మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు.

శుక్రవారం (జులై 11) నాడు గదాధారి హనుమాన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాతలు సి. కల్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ .. "హనుమాన్ సినిమాను నేనే ప్రారంభించాను. ప్రశాంత్ వర్మకి నాతోనే సినిమాను ప్రారంభించాలనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ హనుమాన్ ఎలా హిట్ అయిందో.. ఈ 'గదాధారి హనుమాన్' కూడా అంతే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుక...