భారతదేశం, జనవరి 23 -- మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో ములుగు వైపు వెళ్లే రూట్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నడుస్తాయి. ఈ ట్రైన్స్. సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్‌ కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం జాతర ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్‌ రిజర్వుడ్‌ జనసాధారణ రైళ్లని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. ఈ రైళ్లలో సెకండ్ జనరల్ క్లాస్ కోచులుంటాయని పేర్కొంది.

Publis...