భారతదేశం, నవంబర్ 27 -- శీతాకాల ప్రయాణ నెలల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి. కీలకమైన ప్రాంతీయ మార్గాల్లో రద్దీని తగ్గించడానికి, ప్రయాణికులకు సుదూర కనెక్టివిటీని సులభతరం చేయడానికి ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-అనకాపల్లి మార్గంలో 34 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. డిసెంబర్ 4 నుంచి 2026 మార్చి 26 వరకు నడుస్తాయి. షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్ నుండి అనకాపల్లికి రైలు 07055 డిసెంబర్ 4, 2025 నుండి మార్చి 26, 2026 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు 07056 డిసెంబర్ 5, 2025 నుండి మార్చి 27, 2026 వరకు నడుస్త...