భారతదేశం, అక్టోబర్ 27 -- ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావం ముదలైంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలు, కృష్ణాలో వర్షాలు పడుతున్నాయి. ఇతర జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అలర్ట్ అయింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 43 రైళ్లను రద్దు చేశారు. అక్టోబర్ 27, 28, 29వ తేదీల్లో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులను రద్దు చేస్తున్నట్టుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు రద్దు చేసిన రైళ్ల జాబితాను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణనికి ముందు రైలు స్టేటస్ చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

తుపాను తీవ్రత ఆధారంగా ...