Telangana,karimnagar, జూన్ 13 -- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కరీంనగర్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీంతో నేరుగా కరీంనగర్ నుంచి తిరుమలకు వెళ్లి రావొచ్చు. మొత్తం 8 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. వీటిలో నాలుగు కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్తాయి. మరో నాలుగు తిరుపతి నుంచి కరీంనగర్ కి రాకపోకలు సాగిస్తున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం..తిరుపతి - కరీంనగర్ (ట్రైన్ నెంబర్ 02761) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 6వ తేదీ నుంచి జూలై 27 తేదీల మధ్య రాకపోకలు ఉంటాయి. కేవలం ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ట్రైన్స్ నడుస్తాయి.

ఇక కరీంనగర్ - తిరుపతి (ట్రైన్ నెంబర్ 02762) మధ్య మరో నాలుగు రైళ్లు అందుబాటులో ఉంటాయి. జూలై 7 నుంచి జూలై 28 తేదీల మధ్య రాకపోకలు ఉంటాయి. అది కూడా సోమవారం రోజుల్లో మాత్రమే ట్...