Andhrapradesh,tirupati, జూన్ 15 -- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. మొత్తం 26 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులకు. మరికొన్ని రోజులు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం..చర్లపల్లి - తిరుపతి (నంబర్ 07017) మధ్య నడిచే ప్రత్యేక రైలు... జూలై 4 నుంచి జూలై 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9:45 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:15 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇక తిరుపతి - చర్లపల్లి ( నంబర్ 07018) మధ్య నడిచే ప్రత్యేక రైలు.. జూలై 5 నుం...