భారతదేశం, మే 23 -- వరంగల్- విజయవాడ మార్గంలో మూడో రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో.. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందినట్లు అధికారులు చెబుతున్నారు.

కాజీపేట్- కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల పాక్షిక రద్దు, దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ మార్పులను అనుసరించి రైల్వే ప్రయాణికులు తమ రాకపోకలను సాగించాలని సూచించారు. ఈ నెల 23 నుంచి 29 వరకు.. డోర్నకల్‌- విజయవాడ(67767), విజయవాడ- డోర్నకల్‌ (67768), విజయవాడ- భద్రాచలం రోడ్‌ (బీడీసీఆర్‌) (67215), భద్రాచలం రోడ్‌(బీడీసీఆర్‌)- విజయవాడ (67216), గుంటూరు- సికింద్రాబాద్‌ (12705, సికింద్రాబాద్...