Telangana,hyderabad, జూన్ 21 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ - నాగర్ సోల్ (ట్రైన్ నెంబర్ - 07001) మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 3వ తేదీ నుంచి జూలై 24 తేదీల మధ్య గురువారం రోజుల్లో రాకపోకలు ఉంటాయి. రాత్రి 09. 20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి... మరునాడు 09. 45 గంటలకు నాగర్ సోల్ కు చేరుకుంటుంది.

ఇక నాగర్ సోల్ - సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 07002) మధ్య మరో 4 ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఇవి జూలై 04 నుంచి జూలై 25 తేదీల మధ్య ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 05. 30 గంటలకు నాగర్ సో...