Hyderabad,Andhrapradesh, ఆగస్టు 7 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మైసూర్ తో పాటు కాకినాడ టౌన్ కు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇందుకు సంబంధించిన తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలను ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

సికింద్రాబాద్ - మైసూర్ (07033) మధ్య స్పెషల్ ట్రైన్ ఉండనుంది. ఈ ట్రైన్ సోమ, మంగళవారం తేదీల్లో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతాయి. మరునాడు సాయంత్రం 4 గంటలకు మైసూర్ చేరుకుంటాయి. ఆగస్ట్ 8వ తేదీ నుంచి 29ల మధ్య రాకపోకలు ఉంటాయి.

ఇక మైసూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య కూడా స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. మంగళ, శనివారం తేదీల్లో సాయంత్రం 05.20 గంటలకు మైసూర్ నుంటి ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆగస్ట్ 9 నుంచి ఆ...