భారతదేశం, డిసెంబర్ 3 -- శబరిమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 10 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.డిసెంబరు 13 నుంచి జనవరి 2 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన టికెట్లు ఇవాళ్టి (డిసెంబరు 3) నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.

రానుపోను కలిపి 10 ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి కొల్లాం వెళ్లే ప్రత్యేక రైలుబెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ, తిరుపతి మీదుగా కొల్లాం వెళుతుంది.

చర్లపల్లి నుంచి కొల్లాంకు వెళ్లే స్పెషన్ ట్రైన్.. సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి వికారాబాద్, తాండూరు మీదుగా గుంతకల్, చిత్తూ...