భారతదేశం, జనవరి 29 -- ప్రయాగ్‌రాజ్‌లో మౌని అమవాస్య భయం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా మౌని అమవాస్య రోజున జరిగిన కుంభమేళాలో దాదాపు 800 మంది మరణించారు.! స్వాతంత్య్రం వచ్చినాక జరిగిన మెుదటి కుంభమేళాలో ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం..

ఫిబ్రవరి 3, 1954న ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాకు మౌని అమావాస్య సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అకస్మాత్తుగా కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీని కారణంగా స్నానాల నుంచి పరుగులు పెడుతున్న సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ ఘటనలో దాదాపు 800 మంది భక్తులు మరణించారు. ఆ కుంభమేళాకు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా వచ్చారని చెబుతారు.

ఫిబ్రవరి 2, 3వ తేదీ మధ్య రాత్రి గంగానదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిందని ప్రచారం జరిగింది. సంగం ఒడ్డున ఉన్న సాధువులు, ఋషుల ఆశ్ర...