భారతదేశం, నవంబర్ 3 -- సినిమాలు డబ్బున్న ఎవరైనా తీస్తారు.. కానీ ఆ సినిమాను ప్రమోట్ చేయడం రాకపోతే దండగ అంటున్నాడు రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని. Gulte Proకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు దీని గురించి మాట్లాడాడు. నిజంగానే ఈ కాలంలో సినిమాలు తీయడం కాదు.. వాటిని వినూత్నంగా జనంలోకి తీసుకెళ్తేనే సక్సెస్ సాధిస్తున్నాయి.

రష్మిక మందన్నా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని ప్రొడ్యూస్ చేసిన ధీరజ్ మొగిలినేని మూవీ ప్రమోషన్లపై ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాను ఎలా తీశామన్నది కాదు.. ఎలా ప్రమోట్ చేశామన్నదానిపైనే సక్సెస్ ఆధారపడిన ఈ రోజుల్లో చిన్న ప్రొడ్యూసర్లకు ధీరజ్ కీలకమైన సూచనలు చేశాడు.

"తమ సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో చాలా మంది ప్రొడ్యూసర్లకు తెలియదు. వాళ్ల ఫిల్మ్ మేకింగ్ సిలబస్ లో అది ఉండనే ఉండదు. ఎన్నో ఏళ్లుగా ఫాలో అవు...