భారతదేశం, నవంబర్ 10 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు. ఆదివారం రాత్రిపూట హైదరాబాద్‌ నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అందెశ్రీ మరణించారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీది కీలక పాత్ర. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది.

అందెశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రిపూట లాలాగూడలోని నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.

అందెశ్రీ 1961 జులై 18వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో(ఇప్పుడు సిద్దిపేట జిల్లా)లో జన్మించారు. అసలు పేరు అందె ఎల్లన్న. తర్వాత అందెశ్రీగా అందరికీ పరిచయమయ్యారు. భవన నిర్మాణ కార్మికు...