భారతదేశం, డిసెంబర్ 15 -- హాలీవుడ్​ ప్రముఖ డైరక్టర్​ రాబ్ రైనర్, ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్ దారుణ హత్యకు గురయ్యారు. లాస్​ ఏంజిల్స్ బ్రెంట్​వుడ్​లోని నివాసంలో ఇద్దరు రక్తపుమడుగులో కనిపించారు. వారి శరీరాలపై అనేక కత్తిపోట్లు కనిపించాయి. సొంత కుమారుడు నిక్​ రైడర్​ వారిని చంపినట్టు అమెరికా వార్తా సంస్థలు సోర్స్​లను ఉటకిస్తూ కథనాలను ప్రచురిస్తున్నాయి.

ఈ బ్రెంట్‌వుడ్ ప్రాంతం నగర పశ్చిమ భాగంలో ఉంటుంది. హాలీవుడ్​కి చెందిన అనేక మంది ప్రముఖల లగ్జరీ నివాసాలు ఇక్కడ ఉంటాయి. కాగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) తర్వాత వైద్య సహాయం కోసం వచ్చిన కాల్‌కు స్పందించినట్లు లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం తెలిపింది. ఇంటి లోపల 78 ఏళ్ల వ్యక్తి, 68 ఏళ్ల మహిళ మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

లాస్ ఏంజిల్స్ పోలీసు విభాగం కెప్టె...