భారతదేశం, మే 7 -- బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి లండన్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు.రెండు రోజుల క్రితం లండన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన జారి పడటంతో కుడి భుజానికి తీవ్ర గాయమైంది.

లండన్‌లో ప్రాథమిక చికిత్స తీసుకున్న సుజనా చౌదరిని.. మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. సర్జరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు సుజనా చౌదరి.

'సుజనా చౌదరికి నిన్న లండన్‌లో ప్రమాదం జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ఒక సూపర్ మార్కెట్ లో స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి కుడి భుజానికి స్వల్ప గాయమైంది. అనంతరం ఆయన హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మైనర్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ...