భారతదేశం, జనవరి 22 -- రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సంప్రదాయ విద్యా విధానంతో పాటు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన డిజిటల్ ఎడ్యుకేషన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
వైద్య విద్యలో సాంకేతికతను జోడించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఎడ్యుకేషన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
'ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4,140 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో కాలేజీల సంఖ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.