భారతదేశం, నవంబర్ 2 -- హైదరాబాద్ లోని మియాపూర్లో నిర్మించిన ఓ అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని శనివారం కూల్చివేసింది. ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మిస్తున్నట్టు నిర్ధారించటంతో చర్యలు తీసుకుంది.

హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ లోని సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి అక్రమ కట్టడాలను నిర్మించారు. అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్ ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడ్డారు. 126/D , 126/ part, 126/C గా ప్లాట్లను సృష్టించారు.

మియాపూర్లోని HMDA భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎ...