భారతదేశం, అక్టోబర్ 13 -- తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బృందాలను నియమిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. విద్యా నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో పర్యవేక్షణ పెంచాలని భావిస్తోంది. పాఠశాల విద్య డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ ప్రకారం, ప్రతి బృందం మూడు నెలలకు ఒకసారి 100 ప్రాథమిక పాఠశాలలు, 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేస్తుంది. మూడు నెలల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతీ వారం డీఈఓలకు నివేదిక సమర్పించాలి.

జిల్లా విద్యా అధికారులు(డీఈఓ) తమ జిల్లాల్లోని పాఠశాలల సంఖ్య ఆధారంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయులలో రెండు శాతం మంది ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తారు. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసే బృందాలలో ఇద్దరు సభ్యులు, ఒక నోడల్ అధికారి...