భారతదేశం, ఏప్రిల్ 22 -- రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ నేతృత్వంలో పీఎసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఐపీఎస్‌ అధికారి ఆంజనేయులు అరెస్టు దారుణమన్నారు. ఇది కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలకు పరాకాష్ట అన్నారు.

"పీఏసీ పార్టీలో అత్యున్నతమైనది. ఇందులో తీసుకునే నిర్ణయాలు పార్టీ దిశ, దశను నిర్ణయిస్తాయి. ఈ కమిటీ ప్రతి అంశం మీద పార్టీకి దిశానిర్దేశం చేస్తుంది. వివిధ అంశాల మీద సమగ్రంగా చర్చిస్తూ, పార్టీకి సూచనలు చేస్తుంది. అంతేకాక రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేయాలన్న దానిపై కూడా తగిన ఆలోచనలు చేయడంతో పాటు, సలహాలు కూడా ఇస్తుంది. ఇకపై ...