భారతదేశం, జూన్ 3 -- చాలా కాలం నుంచి ఒక్క అప్ డేట్ లేక విసిగిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరే న్యూస్. ఈ పాన్ ఇండియా స్టార్ లేటెస్ట్ మూవీ 'రాజాసాబ్' నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఒకటి కాదు రెండు వార్తలతో అభిమానులకు మేకర్స్ డబుల్ ట్రీట్ ఇచ్చారు. రాజాసాబ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ తో పాటు టీజర్ వచ్చే తేదీని కూడా ప్రకటించేశారు మేకర్స్. మంగళవారం (జూన్ 3) స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ థియేటర్లకు ఈ ఏడాది డిసెంబర్ 5న రాబోతోంది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేందుకు, బిగ్ స్క్రీన్ మీద మరోసారి ప్రతాపం చూపించేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆ రోజు రాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని స్పెషల్ పోస్టర్ లో మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాలిపోతున్న డబ...