భారతదేశం, నవంబర్ 12 -- ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ స్పిరిట్. ఈ సినిమా నుంచి ఈ మధ్యే ఓ ఆడియో అప్డేట్ కూడా సందీప్ రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడని వస్తున్న వార్తలను మాత్రం అతడు ఖండించాడు. అందులో నిజం లేదని స్పష్టం చేశాడు.

ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్న స్పిరిట్ మూవీలో చిరంజీవి నటించడం లేదని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. అవన్నీ ఉత్త పుకార్లే అని తేల్చి చెప్పాడు. ప్రభాస్ తండ్రి పాత్రగానీ, వేరే ఇతర ఏ పాత్రా చిరంజీవి పోషించడం లేదని సందీప్ తెలిపాడు. అయితే తాను చిరుతో కలిసి వేరే మూవీ చేస్తానని మాత్రం అతడు స్పష్టం చేశాడు. మరోవైపు స్పిరిట్ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ పాత్ర పోషించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై మాత్రం స...