భారతదేశం, జూలై 6 -- వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. వేల కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. కల్కిలో యాక్టింగ్ తో అదరగొట్టాడు. రీసెంట్ గా కన్నప్ప మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది రాజాసాబ్ అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇవే కాకుండా ఫౌజీ, స్పిరిట్ తదితర సినిమాలు ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా కోసం ప్రభాస్ చర్చలు జరుపుతున్నారనే టాక్ వైరల్ గా మారింది.

అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించాడు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాసామి. శివ కార్తీకేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ ప్లే చేసిన ఆ మూవీ ఆడియన్స్ మనసులకు హత్తుకుంది. ఇప్పుడు అమరన్ డైరెక్టర్ తో ప్రభాస్ తర్వాతి సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే తన స్టోరీని ప్రభాస్ కు ...