భారతదేశం, జనవరి 9 -- రాజా సాబ్ అంటూ హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ తో థియేటర్లలోకి వచ్చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడిపోయాయి. రాజా సాబ్ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు ఆడిపాడారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిది కుమార్ లు సినిమాలో ఏ క్యారెక్టర్ చేశారో ఓ లుక్కేయండి.

రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్ 'బెస్సీ' క్యారెక్టర్ ప్లే చేసింది. ఇందులో నన్ పాత్ర పోషించింది ఈ అందాల భామ. తన డ్యూటీపై శ్రద్ధతో ఉండే ఈ అమ్మాయి ప్రభాస్ ను కలిశాక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ప్రభాస్ ప్రేమ కోసం తపిస్తుంది. ప్రభాస్ తో రొమాంటిక్ సాంగ్ లోనూ అదరగొట్టింది నిధి అగర్వాల్.

మరో అందాల భామ మాళవిక మోహనన్ రాజా సాబ్ సినిమాలో భైరవి క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో ఆమె ప్యాలెస్ అకౌంటెంట్, సముద్రఖని ...