Hyderabad, జూలై 4 -- ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతనికి కిడ్నీ మార్పిడి అత్యవసరం అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని కుమార్తె స్రవంతి మాట్లాడుతూ.. ఆర్థిక సహాయం అందించడానికి ప్రభాస్ టీమ్ తమను సంప్రదించిందని వెల్లడించారు. అలాగే, తన తండ్రితో కలిసి పనిచేసిన ఇతర టాలీవుడ్ అగ్ర తారల సహాయాన్ని కూడా ఆమె అభ్యర్థించారు.

టాలీవుడ్ లో ఫిష్ వెంకట్ గా పేరుగాంచిన నటుడు, కమెడియన్ ఇతడు. ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్యూర్ తో అతని ఆరోగ్యంగా విషమంగా ఉంది. దీంతో వెంకట్ కుమార్తె స్రవంతి మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నీ మార్పిడికి కనీసం రూ. 50 లక్షలు అవసరమవుతాయని, ఈ ఖర్చులో ప్రభాస్ సహాయం చేయడానికి ముందుకొచ్చారని చెప్పారు.

"నాన్న ఆరోగ్యం అస్సలు బాలేదు...