Hyderabad, ఆగస్టు 28 -- రజనీకాంత్ ఈ మధ్యే ఇండియాలో ఉన్న ఎలైట్ యాక్టర్స్ లిస్ట్‌లో చేరాడు. అతని రీసెంట్ రిలీజ్ కూలీ.. వరల్డ్‌వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.500 కోట్లు క్రాస్ చేసింది. రజనీకాంత్ కు ఇప్పుడు రూ.500 కోట్ల క్లబ్‌లో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ ఘనత సాధించిన ఐదుగురు ఇండియన్ యాక్టర్స్ లో అతడు కూడా ఒకరు. కానీ ఎక్కువ రూ.500 కోట్ల హిట్స్ ఇచ్చిన యాక్టర్ రికార్డు మాత్రం ప్రభాస్ పేరిట ఉంది.

రజనీకాంత్‌కు మూడు రూ.500 కోట్ల హిట్స్ (2.0, జైలర్, కూలీ) అతన్ని సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌తో కలిపి లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిపాయి. ఈ ఇద్దరికి కూడా మూడేసి సినిమాలు ఉన్నాయి. కానీ నాలుగు సినిమాలు ఉన్న టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. ప్రభాస్ తొలిసారి ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి: ది బిగినింగ్ (రూ.650 కోట్లు)తో ఈ క్లబ్‌లో చేరాడు. ఆ తర్వాత మరో మూ...