భారతదేశం, జనవరి 9 -- మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' చిత్రం ఇవాళ, జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. అయితే, విడుదల కార్యక్రమం సజావుగా సాగలేదు. ప్రీమియర్ షోల సమయంలోనే అభిమానులు థియేటర్లలోకి చొరబడి, ప్రదర్శన ఆలస్యమైనందుకు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. కొన్ని చోట్ల షోలు రద్దు చేశారు.

రాజా సాబ్ ప్రీమియర్స్ సందర్భంగా కొన్ని థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమైనప్పటికీ, హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యం కావడంతో చివరి నిమిషంలో ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ అనిశ్చితి నగరంలోని కొన్ని థియేటర్లలో గందరగోళానికి, అశాంతికి దారితీసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలలో ఆగ్రహించిన అభిమానులు థియేటర్లలోకి దూసుకుపోవడం, మ...