Hyderabad, జూన్ 18 -- ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ టీజర్ ఈ మధ్యే రిలీజైన విషయం తెలుసు కదా. అయితే ఈ మూవీ కోసం అత్యంత భారీ సెట్ నిర్మించారన్న విషయం మీకు తెలుసా? ఆరు నెలలుగా ఈ సెట్ లోనే ప్రభాస్, సంజయ్ దత్ లాంటి స్టార్లు షూటింగ్ చేస్తున్నారు.

మూవీని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ సెట్ ను నిర్మించింది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ సెట్ గా చెబుతున్నారు. ఇండియాలోనే అతిపెద్ద హారర్ మూవీగా మేకర్స్ చెబుతున్న ది రాజా సాబ్ సెట్ ఎలా ఉందో చూడండి.

'ది రాజాసాబ్' టీజర్ ఈ మధ్యే రిలీజైంది. ఈ హారర్ ఫాంటసీ మూవీలో మరోసారి వింటేజ్ ప్రభాస్ ను చూసే అవకాశం అభిమానులకు కలగనుంది. ఇక ఈ సినిమాలో ఎక్కువ భాగం టైటిల్ పాత్ర పోషించిన రాజా సాబ్ (సంజయ్ దత్) ఉండే రాజభవనం లాంటి సెట్లోనే మూవీ షూటింగ్ జరుగుతోంది.

షూటింగ్ ను సులభతరం చేయడానికి, నిర్మ...